ఎవరు ఉన్నా లేకున్నా

Evaru Unnaa Laekunnaa

UncategorizedAdded on 5/22/2020

Lyrics

ఎవరు ఉన్నా లేకున్నా
యేసయ్య ఉంటే నాకు చాలు
అందరి ప్రేమ అంతంత వరకే
యేసయ్య ప్రేమ అంతము వరకు
కునుకడు నిదురపోడు
కాపాడుతాడు నన్నెప్పుడు
ఆపదొచ్చినా అపాయమొచ్చినా
రాయి తగలకుండ నన్ను ఎత్తుకుంటాడు
(2)       ||అందరి||
తల్లి మరచినా తండ్రి విడచినా
నాతోనే ఉంటాడు ఎల్లప్పుడు
ముదిమి వచ్చినా తల నెరిసినా
చంక పెట్టుకొని నన్ను మోస్తాడు
(2)       ||అందరి||
అలసిన కృషించినా
తృప్తి పరచును నన్నెల్లప్పుడు
శత్రువొచ్చినా శోధనలు చుట్టినా
రెక్కలు చాపి నన్ను కాపాడును
(2)       ||అందరి||