ఎవరున్నారు నాకిలలో

Evarunnaaru Naakilalo

Lyricistఎన్ సుమన్
UncategorizedAdded on 2/14/2016

Lyrics

నీవున్నావని ఒకే ఆశ
నడిపిస్తావని ఒకే ఆశ
ఎవరున్నారు నాకిలలో
నీవు తప్ప ఎవరున్నారు నాకు ఇలలో
ఎవరున్నారు నాకు యేసయ్యా
ఎవరున్నారయ్యా
నీవున్నావని ఒకే ఆశతో
నడిపిస్తావని ఒకే ఆశలో
ఆదరిస్తావని ఆదుకుంటావని
అద్దరికి చేరుస్తావని నీ జీవిస్తున్నా
ఆశలే అడి ఆశలై
బ్రతుకెంతో భారమై
కలలన్ని కన్నీటి వ్యధలై
గుండెను పిండే దుఃఖమున్నా
||నీవున్నావని||
ఆప్తులే దూరమై
బంధు మిత్రులకు భారమై
నా అన్న వారే నాకు కరువై
గుండెను పిండే దుఃఖమున్నా
||నీవున్నావని||
యాత్రలో తుఫానులే
నా నావనే ముంచేసినా
అద్దరి చేరే ఆశలే అనగారినా
గుండెను పిండే దుఃఖమున్నా
||నీవున్నావని||

Video