గాయపడిన నీ చేయి

Gaayapadina Nee Chaeyi

Lyricistదియ్యా ప్రసాద రావు
UncategorizedAdded on 6/24/2021

Lyrics

గాయపడిన నీ చేయి చాపుము దేవా
నీ సిలువ రక్తమును ప్రోక్షించుము నా ప్రభువా
సిలువే నాకు విలువైనది
అదియే నా బ్రతుకున గమ్యమైనది
ఎంతో రమ్యమైనది
||గాయపడిన||
ఎండిన భూమిలో మొలచిన లేత
మొక్క వలె నీవు ఎదిగితివి
సురూపమైనా ఏ సొగసైనా
లేనివానిగా నాకై మారితివి
||గాయపడిన||
మనుషులందరు చూడనొల్లని
రూపముగా నాకై మారితివి
మా రోగములు మా వ్యసనములు
నిశ్చయముగా నీవు భరియించితివి
||గాయపడిన||
నీవు పొందిన దెబ్బల వలన
స్వస్థత నాకు కలిగినది
నీవు కార్చిన రక్తమే
మా అందరికీ ఇల ప్రాణాధారము
||గాయపడిన||

Video