గగనము చీల్చుకొని

Gaganamu Cheelchukoni

Lyricistహోసన్నా మినిస్ట్రీస్
UncategorizedAdded on 6/30/2023

Lyrics

గగనము చీల్చుకొని ఘనులను తీసుకొని
నన్ను కొనిపోవ రానైయున్న
ప్రాణప్రియుడా యేసయ్యా
నిన్ను చూడాలని…
నా హృదయమెంతో ఉల్లసించుచున్నది
ఉల్లసించుచున్నది…
||గగనము||
నీ దయా సంకల్పమే – నీ ప్రేమను పంచినది
నీ చిత్తమే నాలో నెరవేరుచున్నది
పవిత్రురాలైన కన్యకగా – నీ యెదుట నేను నిలిచెదను
నీ కౌగిలిలో నేను విశ్రమింతును
నీ మహిమైశ్వర్యమే – జ్ఞాన సంపదనిచ్చినది
మర్మమైయున్న నీవలె రూపించుచున్నది
కళంకములేని వధువునై – నిరీక్షణతో నిన్ను చేరెదను
యుగయుగాలు నీతో ఏలెదను
నీ కృపా బాహుళ్యమే – ఐశ్వర్యమునిచ్చినది
తేజోవాసుల స్వాస్థ్యం అనుగ్రహించినది
అక్షయమైన దేహముతో – అనాది ప్రణాళికతో
సీయోనులో నీతో నేనుందును

Video