ఘనమైన నా యేసయ్యా
Ghanamaina Naa Yaesayyaa
Lyricistమాథ్యూస్
UncategorizedAdded on 9/2/2017
Lyrics
ఘనమైన నా యేసయ్యా బహు ఆశ్చర్యములు నీ ఘన కార్యములు (నా) శిరము వంచి స్తుతియింతును నీ – కృపా సత్యములను ప్రకటింతును (2) ||ఘనమైన|| నీ చేతి పనులే కనిపించే నీ సృష్టి సౌందర్యము నీ – ఉన్నతమైన ఉద్దేశమే మంటి నుండి నరుని నిర్మాణము ఒకని నుండి ప్రతి వంశమును సృష్టించినావయ్యా తరతరములుగా మనుష్యులను పోషించుచున్నావయ్యా ఏమని వర్ణించెదను నీ ప్రేమను నేనెన్నని ప్రకటించెదను నీ కార్యములు (2) ||ఘనమైన|| మహోన్నతమైన సంకల్పమే పరమును వీడిన నీ త్యాగము నీ – శాశ్వత ప్రేమ సమర్పణయే కలువరి సిలువలో బలియాగము మార్గము సత్యము జీవము నీవై నడిపించుచున్నావయ్యా మానవ జాతికి రక్షణ మార్గము చూపించుచున్నావయ్యా ఏమని వర్ణించెదను నీ ప్రేమను నేనెన్నని ప్రకటించెదను నీ కార్యములు (2) ||ఘనమైన|| సంఘ క్షేమముకై సంచకరువుగా పరిశుద్ధాత్ముని ఆగమనము అద్భుతమైన కార్యములే నీవు ఇచ్చిన కృపా వరములు పరిపూర్ణతకై పరిశుద్ధులకు ఉపదేశ క్రమమును ఇచ్చావయ్యా స్వాస్థ్యమైన జనులకు మహిమ నగరం నిర్మించుచున్నావయ్యా ఏమని వర్ణించెదను నీ ప్రేమను నేనెన్నని ప్రకటించెదను నీ కార్యములు (2) ||ఘనమైన||