గొంతు ఎత్తి చాటెదాను
Gomthu Eththi Chaatedaanu
Lyricistజ్యోతి మనోహర్
UncategorizedAdded on 9/2/2017
Lyrics
గొంతు ఎత్తి చాటెదాను నడుము కట్టి పయనింతును నా యేసు గొప్పవాడు నిన్ను నన్ను ఎన్నడూ విడువలేనన్నాడు నీ కొరకే నేనన్నాడు నా యేసు గొప్పవాడు (4) ||గొంతు|| ఎంత గొప్ప కార్యము చేసినాడు ఎర్ర సంద్రమునే చీల్చినాడు ఎంత గొప్ప మహిమను తెచ్చినాడు యెరికో గోడలు కూల్చినాడు ఎంతాటి కార్యమైనా చేయగలడు శక్తివంతుడు అసాధ్యుడు నా తండ్రి గొప్పవాడు (4) ||గొంతు|| ఎంత గొప్ప కార్యము చేసినాడు నిషేధించిన రాయి స్థానం మార్చాడు పనికిరాని పాత్రను వాడగలడు గొప్పదైన దానిగా చేయగలడు ఎన్నిక లేని నన్ను ఎన్నుకున్నాడు ఎంత గొప్ప దేవుడు నా యేసుడు నా యేసు గొప్పవాడు (4) ||గొంతు|| కన్న తల్లి కన్న తండ్రి చూపలేనిది నా యేసు తండ్రి చూపుతాడు ఈ లోక స్నేహం ఇవ్వలేనిది నా యేసు ప్రాణం ఇచ్చినాడు ఎన్నాడు విడువని గొప్ప దేవుడు లోకమంతా విడిచినా నిన్ను విడువడు నా యేసు గొప్పవాడు (4) ||గొంతు||