గూడు లేని గువ్వనై
Goodu Laeni Guvvanai
UncategorizedAdded on 7/19/2016
Lyrics
నీడ లేని మనిషినై – అందరిలో ఒంటరినై దారి తెలియని స్థితిలో నిలబడి ఉన్నాను సహాయము కొరకు ఆర్జిస్తు ఉన్నాను అప్పుడొక మెల్లని స్వరము నాతో మాట్లాడి చెప్పెను ప్రభువైన యేసుని ఎప్పుడైతే ఆ స్వరము విన్నానో నేను నా జీవితమంత ప్రకాశింప సాగింది అప్పుడొక తియ్యని స్వరము నాతో మాట్లాడి చెప్పెను ప్రియుడైన యేసుని ఎప్పుడైతే ఆ స్వరము విన్నానో నేను నా పాప జీవితము పారిపో సాగింది అప్పుడొక అద్భుత స్వరము నాతో మాట్లాడి చెప్పెను రాజైన యేసుని ఎప్పుడైతే ఆ స్వరము విన్నానో నేను నా ప్రశ్నలన్నిటికి జవాబులు దొరికాయి గూడు ఉన్న గువ్వనై – కూడు ఉన్న బిడ్డనై నీడ ఉన్న మనిషినై – ఒక్కరిలో వెయ్యినై దారి తెలిసిన స్థితిలో నిలబడి ఉన్నాను సేవలోని మాధుర్యము ననుభవిస్తున్నాను యేసుని నమ్ముకో – యేసుని చేరుకో యేసుని కోరుకో – యేసుతో చేరిపో