గొప్ప దేవుడవని

Goppa Daevudavani

UncategorizedAdded on 5/8/2016

Lyrics

గళమెత్తి నిన్ను నేను గానమాడెదన్
రాజుల రాజువని రక్షణ దుర్గమని
నీ కీర్తిని నేను కొనియాడెదన్
హల్లెలూయా నా యేసునాథా
హల్లెలూయా నా ప్రాణనాథా
అద్భుత క్రియలు చేయువాడని
ఆశ్చర్య కార్యాలు చేయగలడని
అద్వితీయుడవని ఆదిసంభూతుడని
ఆరాధించెద నిత్యం నిన్ను
(2)          ||హల్లెలూయా||
సాగరాన్ని రెండుగా చేసినాడని
సాతాను శక్తులను ముంచినాడని
సర్వోన్నతుడవని సర్వ సంపన్నుడని
సాక్ష్య గీతం నే పాడెదన్
(2)           ||హల్లెలూయా||

Video