గొర్రెపిల్ల జీవ గ్రంథమందు
Gorrepilla Jeeva Grmthhammdu
Lyricistదియ్యా ప్రసాద రావు
UncategorizedAdded on 11/5/2015
Lyrics
గొర్రెపిల్ల జీవ గ్రంథమందు – నీ పేరున్నదా పరలోక రాజ్య ప్రవేశము – నీకున్నదా ఏది గమ్యము ఏది మార్గము యోచించుమా ఓ క్రైస్తవా (2) ||గొర్రెపిల్ల|| ఆరాధనకు హాజరైనా కానుకలు నీవు ఎన్ని ఇచ్చినా ఎన్ని సభలకు నీవు వెళ్ళినా మారుమనసు లేకున్న నీకు నరకమే (2) ||గొర్రెపిల్ల|| సంఘములో నీవు పెద్దవైనా పాటలెన్నో నీవు పాడినా వాక్యమును నీవు బోధించినా మారుమనసు లేకున్న నీకు నరకమే (2) ||గొర్రెపిల్ల|| ఉపవాసములు ఎన్ని ఉన్నా ప్రార్థనలు నీవు ఎన్ని చేసినా ప్రవచనములు నీవు ఎన్ని పలికినా మారుమనసు లేకున్న నీకు నరకమే (2) ||గొర్రెపిల్ల||