గొర్రెపిల్ల వివాహోత్సవ

Gorrepilla Vivaahothsava

Lyricistసీయోను గీతాలు
UncategorizedAdded on 11/1/2015

Lyrics

గొర్రెపిల్ల వివాహోత్సవ
సమయము వచ్చెను రండి
సర్వాధికారియు సర్వోన్నతుండైన
మన తండ్రిని ఘనపరచి మనముత్సహించెదము
(2) ||గొర్రెపిల్ల||
సిద్ధపడెను వధువు సుప్రకాశము గల
నిర్మల వస్త్రములతో నలంకరించుకొనెన్
(2) ||గొర్రెపిల్ల||
పరిశుద్ధుల నీతి క్రియలే యా వస్త్రములు
గొర్రె పిల్ల రక్తములో శుద్ధి నొందిన వారు
(2) ||గొర్రెపిల్ల||
తెల్లని గుర్రముపై కూర్చుండినవాడు
నమ్మకమై యున్నట్టి పెండ్లి కుమారుండు
(2) ||గొర్రెపిల్ల||
దేవుని వాక్యమను నామము గలవాడు
రక్తములో ముంచిన వస్త్రమున్ ధరియించె
(2) ||గొర్రెపిల్ల||
ప్రేమించి సంఘముకై ప్రాణంబు నిదె ప్రభువు
పరిశుద్ధ పరచుట కొరకై తానప్పగించుకొనెన్
(2) ||గొర్రెపిల్ల||
శ్రీ యేసు క్రీస్తుండే సంఘంబునకు శిరస్సు
వాక్య ఉదకము తోడ శుద్ధి పరచుచుండె (2)
||గొర్రెపిల్ల||

Video