గుండె బరువెక్కిపోతున్నది
Gumde Baruvekkipothunnadi
Lyricistగుండె బరువెక్కిపోతున్నది
UncategorizedAdded on 11/4/2018
Lyrics
ప్రాణము సొమ్మసిల్లుచున్నది నా మనసేమో కలవరపడుచున్నది యేసయ్యా.. ఆదరించ రావా యేసయ్యా.. బలపరచ రావా ||గుండె|| ప్రాకారము లేని పురముగా నేనుంటిని ఆదరణ లేక దిగులుతో నేనుంటిని నెమ్మది లేదాయెనే – శాంతి కరువాయెనే యేసయ్యా.. ఆధారం నీవే కదా యేసయ్యా.. నా కాపరి నీవే కదా ||గుండె|| అంధకారంలో నా దీపము ఆరిపోయెనే అరణ్య రోదనలో ప్రాణము సొమ్మసిల్లెనే దినదినము నేను కృంగుచున్నాను యేసయ్యా.. వెలిగించగ రావా యేసయ్యా.. లేవనెత్త రావా ||గుండె|| ఎక్కడ చూసిననూ నెమ్మది లేదాయెనే ఎవరిలో చూసిననూ ప్రేమ కరువాయెనే ఆత్మల భారముతో మూల్గుచున్నానయ్యా యేసయ్యా.. దర్శించ రావా యేసయ్యా.. ప్రేమతో నింపుమయా ||గుండె||