గుర్తుండిపోయే ఈ క్షణాలలో

Gurthumdipoyae Ee Kshanaalalo

UncategorizedAdded on 4/27/2018

Lyrics

గుర్తుండిపోయే ఈ క్షణాలలో
ప్రతి గుండె నిండా ఆనందమే
ఘనమైన ఈ వివాహ వేడుక
చేసావు మాకు తీపి జ్ఞాపిక
దేవా నీకు వందనం
చిన్ని మొగ్గలా లేత సిగ్గులా
చిరునవ్వుల ఈ నవ వధువు
నింగి చుక్కలా కాంతి రేఖలా
సుందరుడు ఈ నవ వరుడు
దేవా నీ సన్నిధిలో నిలిచిన ఈ జంటను
దీవించు.. నూరేళ్ళూ.. చల్లగా ఉండాలని
దీవించు.. నూరేళ్ళూ.. నిండుగా ఉండాలని
||గుర్తుండిపోయే||
నీ బాటలో నీ మాటలో
సాగనీ అనురాగమై
నీ ధ్యాసలో నీ ఊసులో
ఎదగనీ అనుబంధమై
దేవా నీ సన్నిధిలో నిలిచిన ఈ జంటను
దీవించు.. నూరేళ్ళూ.. చల్లగా ఉండాలని
దీవించు.. నూరేళ్ళూ.. నిండుగా ఉండాలని
||గుర్తుండిపోయే||

Video