హల్లేలూయా యని పాడి
Hallaelooyaa Yani Paadi
Lyricistకే రాజబాబు
UncategorizedAdded on 11/6/2016
Lyrics
హల్లేలూయా యని పాడి స్తుతింపను రారే జనులారా మనసారా ఊరూరా రారే జనులారా ఊరూరా నోరారా ||హల్లేలూయా|| పాడి పంటలనిచ్చి పాలించు దేవుడని కూడు గుడ్డలనిచ్చి పోషించు దేవుడని తోడు నిడగా నిన్ను కాపాడే నాధుడని పూజించి… పూజించి పాటించి చాటించ రారే ||హల్లేలూయా|| బంధుమిత్రుల కన్నా బలమైన దేవుడని అన్నాదమ్ముళ్ల కన్నా ప్రియమైన దేవుడని కన్నాబిడ్డల కన్నా కన్నుల పండుగని పూజించి… పూజించి పాటించి చాటించ రారే ||హల్లేలూయా|| రాజాధి రాజులకన్నా రాజైన దేవుడని నీచాతి నీచులను ప్రేమింప వచ్చేనని నిన్న నేడు ఏక రీతిగా ఉన్నాడని పూజించి… పూజించి పాటించి చాటించ రారే ||హల్లేలూయా||