హల్లెలూయ పాట
Hallelooya Paata
Lyricistచంద్రశేఖర్ పులివెందుల
UncategorizedAdded on 10/3/2016
Lyrics
హల్లెలూయ పాట – యేసయ్య పాట పాడాలి ప్రతి చోట – పాడాలి ప్రతి నోట హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (4) ||హల్లెలూయ|| కష్టాలుయే కలిగినా – కన్నీరుయే మిగిలినా స్తుతి పాటలే పాడుమా – ప్రభు యేసునే వేడుమా (2) ||హల్లెలూయ|| చెరసాలలో వేసినా- సంకెళ్లు బిగియించినా స్తుతి పాటలే పాడుమా – ప్రభు యేసునే వేడుమా (2) ||హల్లెలూయ|| నీ తల్లి నిను మరిచినా – మరువడు నీ దేవుడు స్తుతి పాటలే పాడుమా – ప్రభు యేసునే వేడుమా (2) ||హల్లెలూయ|| శోధనలు నిను చుట్టినా – సంతోషమే తట్టినా స్తుతి పాటలే పాడుమా – ప్రభు యేసునే వేడుమా (2) ||హల్లెలూయ|| సింహాల కెరవేసినా – అగ్నిలో పడవేసినా ధీరుడవై సాగుమా – ప్రభు సిల్వనే చాటుమా (2) ||హల్లెలూయ||