హల్లెలూయ పాటలతో

Hallelooya Paatalatho

Lyricistరంజిత్ ఓఫిర్
UncategorizedAdded on 7/16/2018

Lyrics

హల్లెలూయ పాటలతో
ఆనంద గీతాలతో
కృపామయుండా నీ మేలులన్ని
స్మరించి స్తుతింతును
నేనారణ్యా యానములో
నిను పలుమార్లు విసిగించినా
కోపించుచునే వాత్సల్యము చూపి
అనుదినము నను మరువక
మన్నాను నాకిడితివి
(2)       ||హల్లెలూయ||
మలినంబైన వలువలతో
నే నీ ఎదుట నిలుచుండగా
కృపతో నా నేరములను క్షమియించి
పరిశుద్ధ వస్త్రములతో
నన్నలంకరించితివి
(2)       ||హల్లెలూయ||
నే కృంగిన వేళలలో
నీ అభిషేక తైలముచే
పక్షిరాజు యవ్వనము వలె నా బలము
నూతనము జేసితివి
నను పైకెగుర జేసితివి
(2)       ||హల్లెలూయ||

Video