హల్లెలూయా ఆరాధన

Hallelooyaa Aaraadhana

Lyricistలిల్లియన్ క్రిస్టోఫర్
UncategorizedAdded on 12/28/2017

Lyrics

హల్లెలూయా ఆరాధన
రాజాధి రాజు యేసునకే
మహిమయు ఘనతయు
సర్వాధికారి క్రీస్తునకే
చప్పట్లు కొట్టుచూ – పాటలు పాడుచూ
ఆ ప్రభుని కీర్తించెదం
నాట్యము చేయుచు – ఉత్సాహ ధ్వనులతో
స్తోత్రార్పణ చేసెదం
||హల్లెలూయా||
రూపింప బడక ముందే
నన్ను ఎరిగితివి
నా పాదములు జారకుండా
రక్షించి నడిపితివి
(2)        ||చప్పట్లు||
అభిషేక వస్త్రము నిచ్చి
వీరులుగా చేసితివి
అపవాది క్రియలను జయించే
ప్రార్థన శక్తినిచ్చితివి
(2)        ||చప్పట్లు||

Video