హల్లెలుయా పాడెదా
Halleluyaa Paadedaa
Lyricistసీయోను గీతాలు
UncategorizedAdded on 2/9/2013
Lyrics
హల్లెలుయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదన్ అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ ||హల్లెలుయా|| వాగ్ధానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ ||హల్లెలుయా|| ఎందరు నిను చూచిరో వారికి వెలుగు కల్గెన్ ప్రభువా నీ వెలుగొందితిన్ నా జీవంపు జ్యోతివి నీవే ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ ||హల్లెలుయా|| కష్టములన్నింటిని ప్రియముగా భరియింతును నీ కొరకే జీవింతును నా జీవంపు దాతవు నీవే ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ ||హల్లెలుయా||