హోసన్ననుచూ స్తుతి పాడుచూ

Hosannanuchoo Sthuthi Paaduchoo

UncategorizedAdded on 10/5/2016

Lyrics

హోసన్నా… హోసన్నా…
(4)           ||హోసన్ననుచూ||
ఈ లోకయాత్రలో బాటసారులం
ఈ జీవన కడలిలో పరదేశులం
క్షణభంగురం ఈ క్షయ జీవితం
అక్షయ నగరం మనకు శాశ్వతం
(2)        ||హోసన్నా||
మన్నయిన ఈ దేహం మహిమరూపమై
ధవళవర్ణ వస్త్రములు ధరియించెదము
నాధుడేసుకు నవ వధువులము
నీతి పాలనలోన యువరాణులము
(2)           ||హోసన్నా||
ప్రతి భాష్ప బిందువును తుడిచివేయును
చింతలన్ని తీర్చి చెంత నిలుచును
ఆకలి లేదు దప్పిక లేదు
ఆహా మన యేసుతో నిత్యమానందం
(2)          ||హోసన్నా||

Video