హృదయాలనేలే రారాజు
Hrudayaalanaelae Raaraaju
Lyricistశాంత వర్ధన్
UncategorizedAdded on 1/17/2016
Lyrics
హృదయాలనేలే రారాజు యేసువా అధరాలపై నీ పేరే కదలాడుతుండగా నీ కొరకే నేను జీవింతును నా జీవితమంతా అర్పింతును ||హృదయాల|| నా ప్రియులే శతృవులై నీచముగా నిందించి నన్నెంతో తూలనాడి నా చేయి వీడగా నా దరికి చేరి నన్ను ప్రేమించినావా నన్నెంతో ఆదరించి కృప చూపినావా నా హృదయనాథుడా నా యేసువా నా ప్రాణప్రియుడా క్రీస్తేసువా ||హృదయాల|| నీ హృదయ లోగిలిలోన నను చేర్చు నా ప్రియుడా నీ ప్రేమ కౌగిలిలోన నను దాచు నా విభుడా పరలోక మార్గాన నడిపించు నా ప్రభు అరణ్య యాత్రలోన నిన్నానుకొందును అతిలోక సుందరుడా శ్రీ యేసువా రాజాధిరాజా ఘన యేసువా ||హృదయాల||