ఇదే నా హృదయ వాంఛన

Idae Naa Hrudaya Vaamchhana

UncategorizedAdded on 2/17/2018

Lyrics

నీవే నా హృదయ స్పందన
నిన్ను చూడాలని – నిన్ను చేరాలని
నా బ్రతుకు నీలో నే సాగని
||ఇదే నా||
నీ యందు నిలిచి ఫలియించాలని
నీ అడుగు జాడలోనే నడవాలని
ఈ లోక ఆశలన్ని విడవాలని
నీ సువార్తను ఇలలో చాటాలని
ఆశతో నీ కొరకై నే వేచియుంటిని –
యేసయ్యా యేసయ్యా నా ప్రాణం నీవయ్యా
నీకన్నా ఈ లోకాన నాకెవరున్నారయ్యా
(2)      ||ఇదే నా||
ప్రతి వారు నీవైపు తిరగాలని
ప్రతి వారి మోకాలు వంగాలని
ప్రతి నాలుక నిన్నే స్తుతియించాలని
ప్రతి ఆత్మ ప్రార్ధనలో నిండాలని
ఆశతో నీ కొరకై నే వేచియుంటిని –
యేసయ్యా యేసయ్యా నా ప్రాణం నీవయ్యా
నీకన్నా ఈ లోకాన నాకెవరున్నారయ్యా
(2)      ||ఇదే నా||
ప్రతి చోట నీ పాట పాడాలని
ప్రతి చోట నీ సువార్త చేరాలని
ప్రతి వారికి రక్షణ కావాలని
ప్రతి వారు నీ సన్నిధి చేరాలని
ఆశతో నీ కొరకై నే వేచియుంటిని –
యేసయ్యా యేసయ్యా నా ప్రాణం నీవయ్యా
నీకన్నా ఈ లోకాన నాకెవరున్నారయ్యా
(2)      ||ఇదే నా||

Video