ఇదే నా కోరిక

Idae Naa Korika

UncategorizedAdded on 1/19/2015

Lyrics

ఇదే నా కోరిక
నవ జీవన రాగమాలిక
||ఇదే నా కోరిక||
యేసు లాగ ఉండాలని
యేసుతోనే నడవాలని
నిలవాలని గెలవాలని
యేసునందే ఆనందించాలని
||ఇదే నా కోరిక||
ఈ లోకంలో పరలోకము
నాలోనే నివసించాలని
ఇంటా బయట యేసునాథునికే
కంటిపాపనై వెలిగిపోవాలని
||ఇదే నా కోరిక||
యాత్రను ముగించిన వేళ
ఆరోహనమై పోవాలని
క్రీస్తు యేసుతో సింహాసనము
పైకెగసి కూర్చోవాలని
||ఇదే నా కోరిక||

Video