ఇదేనా న్యాయమిదియేనా

Idaenaa Nyaayamidiyaenaa

Lyricistఇదేనా న్యాయమిదియేనా
UncategorizedAdded on 8/31/2017

Lyrics

కరుణామయుడు యేసు ప్రభుని – సిలువ వేయ
||ఇదేనా||
కుంటి వారికి కాళ్ళ నొసగే
గ్రుడ్డి వారికి కళ్ళ నొసగే
రోగుల నెల్ల బాగు పరిచే – ప్రేమ మీర
||ఇదేనా||
చెడుగు యూదులు చెరను బట్టి
కొరడా దెబ్బలు కసిగా గొట్టి
వీధులలోనికి ఈడ్చిరయ్యో – రక్తము కారన్
||ఇదేనా||
మోయలేని సిలువ మోపి
గాయములను ఎన్నో చేసి
నడవలేని రాళ్ళ దారిన్ – నడిపిరయ్యో
||ఇదేనా||
ప్రాణముండగానే సిలువ కొయ్యకు
మేకులెన్నో కొట్టిరయ్యో
ప్రక్కలోనే బల్లెముతో – పొడిచిరయ్యో
||ఇదేనా||
ఎన్ని బాధలు పెట్టిన గాని
మారు పల్కడు యేసు ప్రభువు
ఎంత ప్రేమ ఎంత కరుణ – ఎంత జాలి
||ఇదేనా||
ఎన్ని మారులు పాపము చేసి
యేసుని గాయముల్ రేపెదవేల
నరక బాధ ఘోరమయ్యొ – గాంచవేల
||ఇదేనా||