ఇద్దరొక్కటిగ మారేటి

Iddarokkatiga Maaraeti

Lyricistసాయరాం గట్టు
UncategorizedAdded on 10/24/2019

Lyrics

ఇద్దరొక్కటిగ మారేటి మధురమైన క్షణము
దేవుని చిత్తములో పెనవేసిన నిత్య అనుబంధము
వివాహమన్నది అన్నింట ఘనమైనది
ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి
ఒంటరైన ఆదామును చూసి
జంట కావాలని మది తలచి
హవ్వను చేసి జతపరచి – ఫలించమని దీవించెను
సృష్టిపైన అధికారముతో – పాలించుమని నియమించెను
(2)           ||వివాహమన్నది||
ఏక మనసుతో ముందుకు సాగి
జీవ వృక్షముకు మార్గము ఎరిగి
సొంత తెలివిని మానుకొని – దైవ వాక్కుపై ఆనుకొని
సాగిపోవాలి ఆ పయనం – దేవుని కొరకై ప్రతి క్షణం
(2)           ||వివాహమన్నది||
భార్య భర్తలు సమానమంటూ
ఒకరి కోసము ఒకరనుకుంటూ
క్రీస్తు ప్రేమను పంచాలి – సాక్ష్యములను చాటించాలి
సంతానమును పొందుకొని – తండ్రి రాజ్యముకు చేర్చాలి
(2)           ||వివాహమన్నది||

Video