ఇదిగో నేనొక నూతన క్రియను
Idigo Naenoka Noothana Kriyanu
Lyricistసీయోను గీతాలు
UncategorizedAdded on 11/9/2024
Lyrics
ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను ఈనాడే అది మొలచును దాని నాలోచింపరా (2) ||ఇదిగో|| అడవిలో త్రోవనుజేసి – ఎడారిలో నదులను నేను ఎల్లప్పుడు సమృద్ధిగా – ప్రవహింప జేసెదను (2) ||ఇదిగో|| నాదు ప్రజలు త్రాగుటకు – నేనరణ్యములో నదులు సమృద్ధిగా పారునట్లు – సృష్టించెదను నేను (2) ||ఇదిగో|| అరణ్యములో జంతువులు – క్రూరపక్షులు సర్పములు ఘనపరచును స్తుతియించును – దీని నాలోచించుడి (2) ||ఇదిగో|| నూతన సృష్టిగ నినుజేసి – నీ శాంతిని నదివలెజేసి ననుజూచి మహిమపరచి – స్తుతిబాడ జేసెదను (2) ||ఇదిగో|| నేనే దేవుడనని దెలసి – నా కార్యములను నెరవేర్చి ముందున్న వాటికన్న – ఘనకార్యములను జేతున్ (2) ||ఇదిగో|| మరుగైన మన్నానిచ్చి – మరితెల్లని రాతినిచ్చి చెక్కెదనా రాతిమీద – నొక క్రొత్త నామమును (2) ||ఇదిగో|| పరలోక భాగ్యంబులు – నరలోకములో మనకొసగెన్ కరుణాసంపన్నుడగు – మన ప్రభువునకు హల్లెలూయ (2) ||ఇదిగో||