ఇదియే సమయంబు రండి
Idiyae Samaymbu Rmdi
Lyricistజాన్ బిల్మోరియా
UncategorizedAdded on 2/16/2016
Lyrics
ఇదియే సమయంబు రండి యేసుని జేరండి ఇక సమయము లేదండి – రండి రక్షణ నొందండి పాపులనందరిని – తన దాపున చేర్చుటకై ప్రాణము దానముగా తన ప్రాణము నిచ్చెనుగా మరణపు ముల్లును విరిచి – విజయము నిచ్చెనుగా ||ఇక|| రాజుల రాజైన యేసు రానై యుండెనుగా గురుతులు జరిగెనుగా – మీరు సరిగా చూడండి తరుణముండగానే – మీరు తయ్యారవ్వండి ||ఇక|| బుద్ది లేని కన్యకవలె – మొద్దులుగానుంటే సిద్దెలలో నూనె పోసి – సిద్ధపడకపోతే తలుపులు తట్టినను – మీకు తెరువడు సుమ్మండి ||ఇక|| వెలుపటనుంటేను మీరు వేదన నొందెదరు తలుపులు తట్టినను – మీకు తెరువడు సుమ్మండీ మిమ్మును ఎరుగను – మీరెవరో పోమ్మనును ||ఇక|| సందియ పడకండి – మీరు సాకులు చెప్పకను గురుతులు జరిగెనుగా – మీరు సరిగా చూడండి మరణ దినమూ మన – మెరుగము సుమ్మండీ ||ఇక|| జాలము చేయకను – మీరు హేళన చేయకను కులము స్థలమనుచూ – మీరు కాలము గడువకనూ తరుణముండగానే – మీరు త్వరపడి రారండి ||ఇక||