ఇళ్లలోన పండుగంట
Illalona Pmdugmta
UncategorizedAdded on 11/8/2014
Lyrics
ఎందుకో ఎందుకే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా మల్లెపూల మంచు జల్లు మందిరాన కురిసె నేడు ఎందుకో ఎందుకే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా ఆ… అర్దరాత్రి కాలమందు వెన్నెల… ఆహా ఆశ్చర్యకరుడంట వెన్నెల… ఆహా జన్మించినాడంట వెన్నెలా ఈ అవనిలోనంట వెన్నెలా ||ఇళ్లలోన|| హా… ఏ ఊరు ఏ వాడ ఏ దిక్కు పుట్టినాడు కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా ఆ… యూదా దేశమందు వెన్నెల… ఆహా బెత్లెహేము పురమునందు వెన్నెల… ఆహా రాజులకు రాజంట వెన్నెలా ఆ రాజు యేసంట వెన్నెల ||ఇళ్లలోన|| ఆహ… తార చూపు దారిలోనే వచ్చినారు ఎవ్వరే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా ఆ తూర్పు దేశ జ్ఞానులమ్మ వెన్నెల… ఆహా దర్శింప వచ్చినారు వెన్నెల… ఆహా బంగారు సాంబ్రాణి బోళం తెచ్చినారు ఇచ్చినారు వెన్నెలా ||ఇళ్లలోన|| ఆ… దివి నుండి ఈ భువికి వచ్చినాడు ఎందుకే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా పాపులైన మనకోసం వెన్నెల… ఆహా ప్రాణాన్ని అర్పించి వెన్నెల… ఆహా పరలోకానికి మార్గం వెన్నెలా ఉచితంగా ఇచ్చినాడు వెన్నెలా ||ఇళ్లలోన|| హా.. పరలోకం చేరుటకై నేనేమి చెయ్యాలి కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా యేసయ్యను నమ్ముకో వెన్నెల… ఆహా పాపాలను ఒప్పుకో వెన్నెల… ఆహా క్రొత్తగా జన్మించు వెన్నెలా రక్షణను పొందుకో వెన్నెలా ||ఇళ్లలోన||