ఇంత కాలం
Imtha Kaalm
Lyricistశుభనాథ్ తాడి
UncategorizedAdded on 8/4/2015
Lyrics
ఇంత కాలం నీదు కృపలో కాచిన దేవా ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా ||ఇంత కాలం|| ఎన్ని ఏళ్ళు గడచినా – ఎన్ని తరాలు మారినా మారని వీడని ప్రేమే నీదయ్యా మార్చిన నా జీవితం నీకే యేసయ్యా ||ఇంత కాలం|| నీవు చేసిన మేలులు – తలచుకుందును అనుదినం నా స్తుతి స్తోత్రము నీకే యేసయ్యా వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా ||ఇంత కాలం|| దూరమైతిరి ఆప్తులు – విడచిపోతిరి నా హితులు శోధన వేదన తీర్చిన యేసయ్యా తల్లిలా తండ్రిలా కాచిన యేసయ్యా ||ఇంత కాలం||