ఇరువది నలుగురు పెద్దలతో
Iruvadi Naluguru Peddalatho
UncategorizedAdded on 8/8/2017
Lyrics
ఇరువది నలుగురు పెద్దలతో పరిశుద్ధ దూతల సమూహముతో నాలుగు జీవుల గానముతో స్తుతియింపబడుచున్న మా దేవా ||ఇరువది|| భూమ్యాకాశములన్నియును పర్వత సముద్ర జల చరముల్ ఆకాశ పక్షులు అనుదినము గానము చేయుచు స్తుతియింపన్ ||ఇరువది|| కరుణారసమగు హృదయుడవు పరిశుద్ధ దేవ తనయుడవు మనుజుల రక్షణ కారకుడా మహిమ కలిగిన మా ప్రభువా ||ఇరువది|| గుప్పిలి విప్పి కూర్మితోను గొప్పగ దీవెనలిచ్చెదవు గొర్రెల కాపరి దావీదు అయ్యెను ఎంతో మహారాజు ||ఇరువది||