ఇయ్యాల ఇంట్ల రేపు మంట్ల
Iyyaala Imtla Raepu Mmtla
Lyricistశైలన్న
UncategorizedAdded on 11/1/2015
Lyrics
ఇయ్యాల ఇంట్ల రేపు మంట్ల ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే (2) ||ఇయ్యాల|| నువ్వు తొడిగే చెప్పులకు గ్యారెంటి ఉంది జేబుల పెన్నుకు గ్యారెంటి ఉంది గుండు సూదికి గ్యారెంటి ఉంది నీ గుండెకు గ్యారెంటి లేదే (2) ||ఇయ్యాల|| ఎం ఏ చదువులు చదివే అన్న బి ఏ చదువులు చదివే అన్న ఎం ఏ చదువులు ఏటి పాలురా బి ఏ చదువులు బీటి పాలురా (2) ||ఇయ్యాల|| మేడలు మిద్దెలు ఎన్ని ఉన్నా అందం చందం ఎంత ఉన్నా యేసయ్య లేనిది ఎన్ని ఉన్నా ఎన్ని ఉన్నా అన్ని సున్నా (2) ||ఇయ్యాల|| సబ్సే బడా రూపాయంటావు రూపాయీ అన్నిస్తదంటావు రూపాయీ పరలోకమివ్వదు రూపాయీ సంతోషమివ్వదు (2) ||ఇయ్యాల||