జాగ్రత్త భక్తులారా
Jaagraththa Bhakthulaaraa
Lyricistసీయోను గీతాలు
UncategorizedAdded on 11/10/2015
Lyrics
జాగ్రత్త, భక్తులారా పిలుపిదే ప్రభు యేసు వేగవచ్చును వందనం, హోసన్న, రాజాధి రాజు వచ్చును వినుమార్భాటము బూరధ్వనియు ప్రధానదూత శబ్దము చాలా రాత్రి గడిచిపోయే చూడు పగలు వచ్చెనుగా విడువుము అంధకార క్రియలు తేజో ఆయుధముల ధరించుము ||జాగ్రత్త|| గుర్తులన్ని నెరవేరినవి నోవహు కాలము తలచుము లోతు భార్యను మరచిపోకు మేలుకొనెడి సమయము వచ్చె ||జాగ్రత్త|| మన దినములు లెక్కింపబడెను మేల్కొనువారికి భయమేమి ఘనముగ వారెత్తబడుదురు యెవరు ప్రభువుతో నడచెదరో ||జాగ్రత్త|| దైవజనులు కలుతురు గగనమున – ప్రభునందు మృతులు జీవింతురు మేఘమునందు ఎల్లరు చేరి అచ్చటనే ప్రభుని గాంతురు ||జాగ్రత్త|| క్రియలను బట్టి ప్రతిఫలమిచ్చును విజయులే దాని పొందెదరు ప్రీతిగ పల్కును ప్రభువే మనతో నావన్నియు మీవేయనుచు ||జాగ్రత్త||