జాలిగల దైవమా

Jaaligala Devamaa

Lyricistఎస్ జె బెర్క్మన్స్
UncategorizedAdded on 10/2/2018

Lyrics

జాలిగల దైవమా యేసయ్యా
మనసారా స్తుతింతున్‌ స్తోత్రింతును
నీవు దేవుడు సర్వశక్తుడు
నీ జాలికి హద్దులే లేవు
నీ ప్రేమకు కొలతలే లేవు
అవి ప్రతిదినము క్రొత్తగా నుండున్‌
(2)          ||జాలిగల||
నిజముగ మా యొక్క పాపములన్‌ మోసికొని
దుఃఖములను భరించితివే
అయ్యా – దుఃఖములను భరించితివే
||నీవు||
మా కొరకు సమాధానమిచ్చుటకై దండనంత
నీపైన పడెనే ప్రభూ
అయ్యా – నీపైన పడెనే ప్రభూ
||నీవు||
మాదు అతిక్రమములచే గాయపడి నలిగితివే
గాయములచే స్వస్థమైతిమి
నీదు – గాయములచే స్వస్థమైతిమి
||నీవు||