జై జై యేసు

Jai Jai Yaesu

Lyricistసీయోను గీతాలు
UncategorizedAdded on 11/10/2024

Lyrics

జై జై యేసు రాజా జై జై
రాజాధిరాజా నీకే జై జై –
పాపకూపములో బడియున్న
నన్ను జూచి చేయి జాచి
చక్కగ దరికి జేర్చితివి
సిలువ రక్తములో నన్ను కడిగి
పాపమంతా పరిహరించిన
పావనుడగు నా ప్రభుయేసు
నీతి హీనుడనైన నాకు
నీతి రక్షణ వస్త్రములను
ప్రీతితో నొసగిన నీతి రాజా
మంటి పురుగునైన నన్ను
మంటి నుండి మింట జేర్చిన
మహాప్రభుండా నీకే జై జై
పాపశాపగ్రస్తుడనై యుండ
నన్ను గూడ నీ స్వకీయ
సంపాద్యముగా జేసితివి
రాజులైన యాజక గుంపులో
నన్ను గూడ నీ సొత్తైన
పరిశుద్ధ జనములో జేర్చితివి
తల్లియైన మరచిన మరచును
నేను నిన్ను మరువననిన
నమ్మకమైన నా ప్రభువా
అధిక స్తోత్రార్హుడవైన
ఆది యంతము లేని దేవా
యుగా యుగములకు నీకే జై జై

Video