జన్మించె జన్మించె

Janmimche Janmimche

Lyricistక్రాంతి చేపూరి
UncategorizedAdded on 7/10/2018

Lyrics

జన్మించె జన్మించె – రారాజు జన్మించె
చీకటి బ్రతుకులు తొలగించి లోకమునే వెలిగించే
అరుదెంచె అరుదెంచె – నరునిగా ఇల అరుదెంచె
పరలోకము వీడి భువికేతెంచి రక్షణ కలిగించే
ఊరూ వాడా సంబరమే – జీవపు మార్గము వెలిసెనని
నమ్మిన వారికి తప్పకనే – కలిగే ఒక వరమే
హాప్పీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్
విష్ యు ఎ హాప్పీ హాప్పీ క్రిస్మస్
హాప్పీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్
విష్ యు ఎ మెర్రీ మెర్రీ మెర్రీ క్రిస్మస్
దూతకు భయపడి వణికిరి గొల్లలు
శుభవార్తను విని వేగిరమే పరుగిడిరి
సంతోషముతో ఆనంద గానముతో
యేసే ప్రభువని నమ్మిరి పూజించిరి
(2)          ||ఊరూ వాడా||
తారను కనుగొని వచ్చిరి జ్ఞానులు
యేసే రాజని అర్పించిరి కానుకలు
ఆరాధించి హృదయములను అర్పించి
భువినేలే రారాజును కీర్తించిరి
(2)          ||ఊరూ వాడా||
యేసే మార్గము యేసే సత్యము
యేసే జీవము ఇదియే నిత్యము
మన పాపాలన్నీ క్షమియించేదేసయ్యే
విశ్వసించి నీ హృదయమునే అర్పించుము
(2)          ||ఊరూ వాడా||

Video