జయం జయం మన యేసుకే
Jaym Jaym Mana Yaesukae
UncategorizedAdded on 4/3/2021
Lyrics
జాన్ కెన్నెడీ బేతపూడి జయం జయం మన యేసుకే మరణం గెలిచిన క్రీస్తుకే స్తుతులర్పించెదము – స్తోత్రము చేసెదము పునరుత్ధానుడైన క్రీస్తుని మహిమపరచెదము (2) ||జయం జయం|| పాపములేని యేసుడు సిలువలో పాపికై మరణించి మూడవదినమున – తిరిగి లేచెను మరణపు ముల్లును విరిచెను (2) ||జయం జయం|| పాపము చేసి మానవుడు కోల్పోయిన అధికారమును సిలువను గెలిచి – తిరిగి తెచ్చెను సాతాను బలమును గెలిచెను (2) ||జయం జయం|| పాపము విడిచి సోదరా ప్రభు సన్నిధికి రారమ్ము పునరుత్ధాన శక్తితో నింపి పరలోకమునకు చేర్చును (2) ||జయం జయం||