జీవాధిపతివి నీవే

Jeevaadhipathivi Neevae

Lyricistసాయారం గట్టు
UncategorizedAdded on 8/1/2019

Lyrics

జీవాధిపతివి నీవే నా యేసయ్య
నాకున్న ఆధారము నీవేనయ్యా
నీవుంటే చాలు, కీడు కాదా! మేలు
లెక్కింపగ తరమా! నే పొందిన ఈవులు
(2)    ||జీవాధిపతివి||
ఎడారిలోన నీటి ఊట లిచ్చు వాడవు
అల సంద్రములో రహదారులు వేయు వెల్పువు
నీకు కానిదేది సాధ్యము? అడుగుటే ఆలస్యము
నీవు చేయు కార్యము! ఉహించుటె అసాధ్యము
(2)     ||నీవుంటే||
రాజుల హృదయాలను తిప్పువాడవు
నిను నమ్ము వారి పక్షము పోరాడు వాడవు
ఏ చీకటికి భయపడను, లోకమునకు లొంగను
నీవు తోడు ఉండగా, నా వెంట సాగుతుండగా
(2)    ||నీవుంటే||

Video