జీవము గల దేవుని సంఘం

Jeevamu Gala Daevuni Smghm

UncategorizedAdded on 5/23/2020

Lyrics

మనకై దేవుని సంకల్పం – ఎంతో ఎంతో శ్రేష్ఠము
సంకల్పమందున మనముండినా
ఆ సంఘమందున వసియించినా
ఎంతో ఎంతో ధన్యము –
(2)        ||జీవము||
యేసే స్వరక్తమిచ్చి – సంపాదించిన సంఘము
సత్యమునకు స్థంభమును – ఆధారమునైయున్నది
పాతాళలోక ద్వారములు
దాని ఎదుట నిలువవు
(2)        ||జీవము||
యేసే శిరస్సైయున్న – శరీరము మనమందరము
పరిశుద్ధాత్మ మనలో – నివసించుచున్నాడు
ఏ నరుడు దేవుని నిలయమును
పాడు చేయకూడదు
(2)        ||జీవము||
యవ్వన ప్రాయము మనలో – భవ్యానికి భయపడక
సవ్వడి చేయుచు నిరతం – కవ్వించు చుండును
ప్రభు యేసు దివ్య మాదిరిలో
గమ్యము చేరగా సాగుదాం
(2)        ||జీవము||
ఏ ప్రాంతీయుల మైన – మనమందరము సోదరులం
శాశ్వత రాజ్యపు గురిలో – శ్రీ యేసుని సహ వారసులం
లోకాన యేసుని త్యాగమును – సాహసముతో చాటుదాం
లోకాన క్రీస్తుని మహిమను – సహనముతోనే చాటుదాం
||జీవము||

Video