జీవన తొలి సంధ్య

Jeevana Tholi Smdhya

UncategorizedAdded on 10/18/2016

Lyrics

గూడపాటి ఐసాక్ వరప్రసాద్
జీవన తొలి సంధ్య నీతోనే ఆరంభం
నా జీవన మలి సంధ్య నీతోనే అంతము
నా జీవన యాత్రకు మలి సంధ్య ఆసన్నమౌతుంది
నను సిద్ధపరచు యేసు నాథా నీతోనుండుటకు
నా జీవన యాత్రలో ఎన్నో అవరోధాలు
నా జీవన గమనంలో ఎన్నో అవమానాలు
నిరీక్షణ లేని ఇతరుల పోలి దుఃఖించను నేను
నా భారము నీపై మోపి ముందుకు సాగుచున్నాను
దేవా నీవే నా ఆశ్రయ దుర్గము
నా పూర్వికులందరు ఎప్పుడో గతించారు
ఏదో ఒక రోజున నా యాత్ర ముగించెదను
నా శేష జీవితమంతయు నీకే అర్పించితినయ్యా
నా వేష భాషయులన్నియు నీకే సమర్పింతును దేవా
దేవా నను నీ సాక్షిగ నిల్పుమా

Video