జీవింతు నేను
Jeevimthu Naenu
UncategorizedAdded on 7/28/2020
Lyrics
అంశుమతి మేరీ దార్ల జీవింతు నేను ఇకమీదట – నా కొరకే కాదు యేసు కొరకే జీవింతును నన్ను ప్రేమించిన – ప్రియ యేసు కొరకే నాకై ప్రాణమిచ్చిన – ప్రభు యేసు కొరకే జీవింతును జీవింతును జీవింతును జీవింతును (2) ||జీవింతు|| నీ ఉన్నత పిలుపుకు లోబడదున్ – గురివైపునకే బహుమానము పొందగ పరుగిడుదున్ వెనుకవున్నవన్నీ మరతును – ముందున్నవాటి కొరకే నే వేగిరపడుదును నన్ను ప్రేమించిన యేసుని చూతును నాకై ప్రాణమిచ్చిన ప్రభుని వెంబడింతును గురి వైపుకే – పరుగెడుదును వెనుదిరుగను – వెనుదిరుగను (2) ||జీవింతు|| శ్రమయైనా బాధైననూ – హింసయైనా కరువైనా ఎదురైననూ ఉన్నవైన రాబోవునవైనా – అధికారులైనా ఎతైనా లోతైననూ నన్ను ఎడబాపునా ప్రభు ప్రేమనుండి నేను విడిపోదునా ప్రభు నీడనుండి జీవింతును – నా యేసుతో జయమిచ్చును – నా యేసుడే (2) ||జీవింతు||