జీవితమంతా నీ ప్రేమ

Jeevithammthaa Nee Praema

Lyricistఆంధ్ర క్రైస్తవ కీర్తనలు
UncategorizedAdded on 4/6/2017

Lyrics

జీవితమంతా నీ ప్రేమ గానం ప్రణుతింతుమో దేవా
ప్రచురింతు మేము నీ కీర్తిన్ ఆనంద గానంబుతో
సర్వ సమయములలో నీ స్తుతి గానం
ఎల్లవేళలయందు నీ నామ ధ్యానం
మాకదియే మేలు ఈ జీవితమున
స్తుతియింతు నా రక్షకా –
(2)         ||జీవితమంతా||
సృష్టినంతటిని నీ మాట చేత
సృజియించితివిగా మా దేవ దేవా
నీ ఘనమగు మహిమం వర్ణింప తరమా
స్తుతియింతు నా రక్షకా –
(2)         ||జీవితమంతా||
కలుషాత్ములమైన మా కొరకు నీ
విలువైన ప్రాణంబు నర్పించితివిగా
కల్వరి గిరిపై చూపిన ప్రేమన్
స్తుతియింతు నా రక్షకా –
(2)         ||జీవితమంతా||

Video

Jeevithammthaa Nee Praema Lyrics | Shining Christians