జుంటె తేనె ధారల కన్నా
Jumte Thaene Dhaarala Kannaa
Lyricistహోసన్నా మినిస్ట్రీస్
UncategorizedAdded on 11/5/2013
Lyrics
జుంటె తేనె ధారల కన్నా యేసు నామమే మధురం యేసయ్య సన్నిధినే మరువజాలను జీవితకాలమంతా ఆనందించెదా యేసయ్యనే ఆరాధించెదా ||జుంటె తేనె|| యేసయ్య నామమే బహు పూజనీయము నాపై దృష్టి నిలిపి సంత్రుష్టిగా నను ఉంచి నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపజేసెనే ||జుంటె తేనె|| యేసయ్య నామమే బలమైన దుర్గము నా తోడై నిలిచి క్షేమముగా నను దాచి నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే ||జుంటె తేనె|| యేసయ్య నామమే పరిమళ తైలము నాలో నివసించే సువాసనగా నను మార్చి నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపజేసెనే ||జుంటె తేనె||