జ్యోతిర్మయుడా

Jyothirmayudaa

Lyricistహోసన్నా మినిస్ట్రీస్
UncategorizedAdded on 1/19/2016

Lyrics

జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా
స్తుతి మహిమలు నీకే
నా ఆత్మలో అనుక్షణం
నా అతిశయము నీవే – నా ఆనందము నీవే
నా ఆరాధనా నీవే
(2)           ||జ్యోతి||
నా పరలోకపు తండ్రి – వ్యవసాయకుడా
నీ తోటలోని ద్రాక్షావల్లితో
నను అంటు కట్టి స్థిరపరచావా
(2)           ||జ్యోతి||
నా పరలోకపు తండ్రి – నా మంచి కుమ్మరి
నీకిష్టమైన పాత్రను చేయ
నను విసిరేయక సారెపై ఉంచావా
(2)           ||జ్యోతి||
నా తండ్రి కుమారా – పరిశుద్దాత్ముడా
త్రియేక దేవా ఆదిసంభూతుడా
నిను నేనేమని ఆరాధించెద
(2)           ||జ్యోతి||

Video