కాలం సమయం నాదేనంటూ

Kaalm Samaym Naadaenmtoo

UncategorizedAdded on 10/11/2016

Lyrics

రోజులు అన్ని నావేనంటూ జీవిస్తున్నావా
దేవుని ముందు నిలిచే రోజుంది
తక్కెడ తూకం వేసే రోజుంది
జీవ గ్రంథం తెరిచే రోజుంది
నీ జీవిత లెక్క చెప్పే రోజుంది
ఆగవేమయ్యా ఈ మాట వినవయ్యా
ఆగవేమయ్యా నీ మనస్సు మార్చుకోవయ్యా
ధనము బలము ఉన్నదని విర్రవీగుతున్నావా
మేడలు మిద్దెలు ఉన్నాయని అనుకుంటున్నావా
గుజరాతును చూడవయ్యా ఎంత ఘోరమో
ఒక్క ఘడియలెందరో బికారులయ్యారు
(2)         ||ఆగవేమయ్యా||
చూసావా భూకంపాలు కరువులు విపరీతాలు
పరిశుద్ధ గ్రంథములోని కడవరి కాలపు సూచనలు
నిన్నటి వరకు కొదువ లేదని అనుకున్నారు
ఒక్క ఘడియలో ఎందరో నశించిపోయారు
(2)         ||ఆగవేమయ్యా||
సిద్ధపడిన వారి కోసం పరలోకపు ద్వారాలు
సిద్ధపడని వారికి ఆ నరకపు ద్వారాలు
అగ్ని ఆరదు పురుగు చావదు
నిత్యం ఏడుపు దుఃఖాలు
(2)           ||ఆగవేమయ్యా||

Video