కానెన్నడు నేను అనాథను

Kaanennadu Naenu Anaathhanu

UncategorizedAdded on 5/18/2017

Lyrics

కానెన్నడు నేను అనాథను
అయ్య కానెన్నడు నేను అనాథను
(నా) కన్నీరు తుడచువాడా
నేనున్నానని అనువాడా
(2)      ||కానెన్నడు||
అమ్మ నాన్న దూరమైనా
బంధువులే వెలివేసినా
నా అమ్మ నాన్న నీవే యేసయ్యా
నా తోడు నీడ నీవే యేసయ్య
(2)      ||కానెన్నడు||
వెక్కి వెక్కి ఏడుపొచ్చినా
వెక్కిరింతల పాలైనా
నా కన్నీరు తుడచువాడా
నేనున్నానని అనువాడా
(2)      ||కానెన్నడు||
వ్యాధి బాధలవరించినా
రోగములతో కృంగదీసినా
నా వైద్యుడవు నీవే యేసయ్యా
నన్ను స్వస్థపరచువాడవు నీవే
(2)      ||కానెన్నడు||

Video