కావలివాడా ఓ కావలివాడా
Kaavalivaadaa O Kaavalivaadaa
Lyricistసిద్దిపేట ప్రకాష్
UncategorizedAdded on 2/13/2017
Lyrics
కావలివాడా ఓ కావలివాడా కనులు తెరచి పొలమును చూడు కోతకు వచ్చిన పంటను కోయుము ||కావలి|| పిలిచెను నీ యజమానుడు జత పనివాడవై యుండుటకు కొలుచును నీ ఫలమంతమున పని చేసిన రీతిగనే (2) ||కావలి|| నమ్మెను నీ యజమానుడు అప్పగించెను తన స్వాస్థ్యము తిరిగి వచ్చును జీతమియ్యను సిద్ధ పడుము ఇక నిద్ర మాని (2) ||కావలి|| ఎంచెను నీ యజమానుడు నీ పాదములు సుందరములని ఉంచెను కర్మెలు పర్వతముపై పరుగిడుము పరాక్రమ శాలివై (2) ||కావలి|| వేయుము పునాది నేర్పరివై చెక్కుము రాళ్లను శిల్ప కారివై కొయ్య కాలును కర్ర గడ్డియు కాలిపోవును అగ్ని పరీక్షలో (2) ||కావలి||