కలలా ఉన్నది
Kalalaa Unnadi
Lyricistశామ్యూల్ కర్మోజి
UncategorizedAdded on 10/23/2017
Lyrics
కలలా ఉన్నది నేనేనా అన్నది నిజమౌతున్నది నీవు నాతో అన్నది నిరాశల నిశిలోన – ఉషోదయం వచ్చింది యేసు నీ ప్రేమే నను బ్రతికించెను మనుష్యులంతా మనసే గాయపరిచి పురుగల్లె నను నలిపేయ జూచినా శూరుడల్లె వచ్చినావు నాకు ముందు నిలచినావు నాకు బలము ఇచ్చినావు ఆయుధంగా మార్చినావు చల్లని నీ నీడలో నిత్యము నిలువనీ ||కలలా|| శూన్యములో నాకై సృష్టిని చేసి జీవితాన్ని అందముగా మలచేసి మాట నాకు ఇచ్చినవారు దాన్ని నెరవేర్చువారు నిన్ను పోలి ఎవరున్నారు నన్ను ప్రేమించువారు యేసు నీ ప్రేమను ప్రతి దినం పాడనీ ||కలలా||