కలలాంటి బ్రతుకు నాది

Kalalaamti Brathuku Naadi

Lyricistపి సతీష్ కుమార్
UncategorizedAdded on 5/6/2021

Lyrics

కలలాంటి బ్రతుకు నాది
కన్నీటి ఊట నాది
కలలోనైనా ఊహించలేదే
కమనీయమైన ఈ బంధం
కల్వరిలో సిలువ త్యాగ బంధం
(2)      ||కలలాంటి||
నేనేమిటో నా గతమేమిటో
తెలిసిన వారే క్షమియించలేరే
నా నడకేమిటో పడకేమిటో
ఎరిగిన వారే మన్నించలేరే
హేయుడనై చెడియుండగా.. నా యేసయ్యా
ధన్యునిగా నను మార్చినావే
(2)       ||కలలాంటి||
నేనేమిటో నా విలువేమిటో
తెలియకనే తిరుగాడినానే
నీవేమిటో నీ ప్రేమేమిటో
ఎరుగక నిను నే ఎదిరించినానే
హీనుడనై పడియుండగా.. నా యేసయ్యా
దీవెనగా నను మార్చినావే
(2)       ||కలలాంటి||

Video