కలనైనా ఇలనైనా
Kalanainaa Ilanainaa
Lyricistరవిందర్ వొట్టెపు
UncategorizedAdded on 9/13/2017
Lyrics
కలనైనా ఇలనైనా నన్ను ఏనాడైనా విడువని దేవుడా నా యేసయ్యా శ్రమయైనా బాధైనా ఏ కన్నీరైనా ఓదార్చే దేవుడా యేసయ్యా ప్రేమించే వారే లేకున్నా నన్ను కరుణించే వారే లేకున్నా ఆదరించే యేసు నన్ను తల్లి కన్న మిన్నయై ||కలనైనా|| జిగటగల ఊబిలో నుండి లేవనెత్తినావు లోకమంత నను విడచినను విడువనన్న యేసయ్యా నీకేమి చెల్లింతు యేసయ్యా నిన్నెలా వర్ణింతు (2) ||కలనైనా|| పరిశుద్ధాత్మతో నను నింపి శుద్ధిపరచువాడవు లేమి లేక నా హృదయమును తృప్తిపరచువాడవు నీకేమి చెల్లింతు యేసయ్యా నిన్నెలా వర్ణింతు (2) ||కలనైనా||