కలవంటిది నీ జీవితము

Kalavmtidi Nee Jeevithamu

Lyricistజాన్ వెస్లీ
UncategorizedAdded on 6/20/2017

Lyrics

కలవంటిది నీ జీవితము
కడు స్వల్ప కాలము
యువకా అది ఎంతో స్వల్పము
విలువైనది నీ జీవితం
వ్యర్ధము చేయకుము
యువకా వ్యర్ధము చేయకుము
బహు విలువైనది నీ జీవితం
వ్యర్ధము చేయకుము
యువతీ వ్యర్ధము చేయకుము
||కలవంటిది||
నిన్ను ఆకర్షించే ఈ లోకము
కాటు వేసే విష సర్పము
యువకా అది కాలు జారే స్థలము
ఉన్నావు పాపపు పడగ నీడలో
నీ అంతము ఘోర నరకము
యువకా అదియే నిత్య మరణము
(2)        ||కలవంటిది||
నిన్ను ప్రేమించు యేసు నీ జీవితం
నూతన సృష్టిగా మార్చును
పాపం క్షమియించి రక్షించును
ఆ మోక్షమందు నీవుందువు
యుగయుగములు జీవింతువు
నీవు నిత్యము ఆనందింతువు
(2)        ||కలవంటిది||

Video