కళ్లుండి చూడలేని
Kallumdi Choodalaeni
UncategorizedAdded on 10/15/2015
Lyrics
కళ్లుండి చూడలేని ఎందరో ఉన్నారు చూసి చూడనట్టు బ్రతుకుచున్నారు వారి కనులు తెరిపించాలి నీ మహిమతోనే జీవింప చేయాలి నీ మహిమలోనే ||కళ్లుండి|| కంటి చూపుతో నన్ను కాచియున్నావు గుండె పైన వాత పెట్టి నను మార్చినావు మరణాన్ని తప్పించావు జీవాన్ని నాకిచ్చావు ఇంకేల నా యేసయ్యా ||కళ్లుండి|| నీదు ఆత్మతో నన్ను నింపియున్నావు నీదు సాక్షిగా నన్ను ఇల నిలిపియుంచావు నీవే నా గమ్యమని నీలోనే నడిచెదను నాకేగా పరలోకము ||కళ్లుండి||