కలుగును గాక
Kalugunu Gaaka
Lyricistవీర్పుల మోషే
UncategorizedAdded on 5/23/2020
Lyrics
కలుగును గాక – దేవునికి మహిమ – కలుగును గాక కలుగు నున్నతమైన – ఘన స్థలములందున నిలకు సమాధానం – నరుల కాయన దయ ||కలుగును|| ప్రభువైన దేవా – పరమరాజా – సర్వపరిపాలా పరిపూర్ణ శక్తిగల– పరమ జనక నిన్ను మహిమ స్తుతించుచు – మరి పొగడుచున్నాము ||కలుగును|| మహిమపర్చుచు – ఆరాధించు – చున్నాము నిన్ను మహిమాతిశయమును – మది దలంచియు నీకు మహిని మా స్తుతి కృత – జ్ఞత నిచ్చు చున్నాము ||కలుగును|| ఏక కుమారా – యేసు ప్రభువా – యెహోవా తనయా లోక పాపము మోయు – ఏక దేవుని గొఱ్రె పిల్ల మమ్మును కనిన – రించుము చల్లగ ||కలుగును|| పరిశుద్ధుడవు – ప్రభుడవు నీవో – ప్రభువైన క్రీస్తూ పరిశుద్ధాత్మతో తండ్రి – యైన దేవునియందు బరిపూర్ణ మహిమతో – బ్రబలుచున్నామామేన్ ||కలుగును||